రామగుండం, ఆదిలాబాద్ సభల విజయంపై కేటీఆర్ హర్షం
కష్టపడిన ప్రతి కార్యరద్దు అభినందనలు వ్యక్తిగత కీర్తి కాదు..
సమన్వయమే విజయ సూత్రం
సుమన్ తరహా సమన్వయం అందరికీ ఆదర్శం.


పార్టీ విజయానికి వ్యక్తుల కంటే పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయం, సమిష్టి కృషే అసలైన బలమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు.
ఇటీవల రామగుండం, ఆదిలాబాద్ నిర్వహించిన పార్టీ సభలు విజయవంతం కావడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రెండు సభల నిర్వహణలో కీలక బాధ్యతలు చేపట్టి, పార్టీ శ్రేణులను సమన్వయం చేయడంలో ముందుండి పనిచేసిన మాజీ ఎంపీ, సీనియర్ నాయకుడు బాల్క సుమన్ ను ప్రత్యేకంగా అభినందించారు. అదే సమయంలో సభల విజయానికి అహర్నిశలు శ్రమించిన జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల ప్రతినిధులకు కూడా కేటీఆర్ అభినందనలు తెలిపారు. పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయాలంటే వ్యక్తిగత ప్రచారం, ఆధిపత్య ధోరణుల కంటే సమిష్టి బాధ్యత ఎంతో ముఖ్యమని కేటీఆర్ పార్టీ వర్గాలు సూచించారు. ప్రతి నాయకుడు తన బాధ్యతను నిర్వర్తిస్తూనే ఇతరులతో సమన్వయం పెంచుకుంటే పార్టీ లక్ష్యాలు సులభంగా నెరవే రుతాయని ఆయన అభిప్రాయపడినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, రామగుండం, ఆదిలాబాద్ సభల ఏర్పాట్లను ముందుగానే పర్యవేక్షిస్తూ, జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో నిరంతరం సమన్వయం చేస్తూ బాల్క సుమన్ పనిచేశారు. సభలకు భారీగా కార్యక ర్తలు, రైతులు, ప్రజలు తరలివచ్చేలా ప్రణాళికలు రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఆదిలాబాద్ రైతు గర్జన సభకు సుమారు 50 వేల మందిని సమీకరించే లక్ష్యంతో ఏర్పాట్లు చేసినట్లు అప్పుడే ప్రకటించారు

సుమన్ తరహా సమన్వయం అందరికీ ఆదర్శం..
రామగుండం, ఆదిలాబాద్ సభల ఏర్పాట్లలో బాల్క సుమన్ ప్రదర్శించిన కార్యాచ రణను కేటీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు సమాచారం. వివిధ జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చేలా ముందస్తు ప్రణాళిక, స్థానిక నాయకత్వంతో నిరంతర సమస్వయం, బాధ్యతల పంపిణీ వంటి అంశాల్లో ఆయన చొరవ చూపారని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్, “సుమన్లా ప్రతి నాయకుడు బేషజాలు లేకుండా టీమ్ వర్క్ పనిచే యాలి. పార్టీ విజయం కోసం వ్యక్తిగత అభిప్రాయాలకు మించి సంస్థ ప్రయోజనా లను ముందుంచాలి” అని సూచించినట్లు తెలిసింది

