కొలతల ప్రకారం పని చేసి ఉపాధి వేతనం పొందాలని తాండూరు ఎంపీడీవో శ్రీనివాస్ అన్నారు. ఆయన తాండూరు మండలం మాదారంలో జరుగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. పని ప్రదేశంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రభుత్వ కొలతల ప్రకారం ఉపాధి కూలీలు పనిచేసి గిట్టుబాటు వేతనాన్ని పొందాలని కోరారు. ఉపాధి కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొలతల ప్రకారం పని వివరాలను పక్కాగా రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. మరో మూడు రోజుల్లో కొత్త పనిదినాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో అందరికీ పనులు కల్పించే దిశగా కృషి చేయాలని కోరారు. అందరూ పనికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఉపాధి హామీ సిబ్బందికి తెలిపారు.
అనంతరం మాదారం టౌన్షిప్‌లో నూతనంగా నిర్మించిన రోడ్లను తనిఖీ చేశారు.
